aha video sankranthi hungamaప్రతి వారం సరికొత్త వినోదాన్ని అందిస్తూ తెలుగు ప్రజల మదిలో చోటు సంపాదించుకున్న “ఆహా” ఈ సంక్రాంతి పండుగకు ముచ్చటైన వినోదాన్ని సిద్ధం చేసింది. “అమెరికన్ డ్రీం” పేరుతో యుఎస్ లో తెలుగు వారు పడుతోన్న పాట్లను, కంటోన్న కలలను వినోదాత్మకంగా తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టింది.

ఇక ఇండియాలోనే నెంబర్ 1 షోగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే” కార్యక్రమంలో ఈ పండగ పర్వదినాన ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ మరియు మాస్ చిత్రాల మెగా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ లతో బాలకృష్ణ సందడి చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో యూత్ స్టార్ విజయ్ దేవరకొండను మించిపోయి బాక్సింగ్ ఆడుతూ బాలయ్య సృష్టించిన హంగామా తెలిసిందే.

ఈ షోకు వచ్చిన రేటింగ్స్ తో ఇండియా వ్యాప్తంగా “ఆహా” బాగా ప్రాచుర్యం పొందింది. ఆ కోవలోనే ‘ఆహా’ తమిళ భాషను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల వారి చేత కూడా “ఆహా – ఓ మంచి వినోదాత్మకమైన ఓటీటీ” అనిపించుకునే దిశగా అడుగులు వేస్తోంది.