ప్రెజెంట్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న స్టార్ హీరోల లిస్ట్ లో అందరికంటే ముందున్నారు అల్లు అర్జున్. అవును బన్నీ గెస్ట్ గా వారానికో ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటికే ‘వరుడు కావలెను’ , ‘పుష్పక విమానం’ ఈవెంట్స్ లో గెస్ట్ గా మెరిసిన బన్నీ మరో సారి ఈవెంట్ లో కనిపించబోతున్నాడు.

ఆహా ఆప్ త్వరలోనే గ్రాండ్ గా ఆహా 2.O అనే ఈవెంట్ చేస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్. ఇప్పటికే గ్రాండ్ ఈవెంట్ అంటూ అందులోనే బన్నీ గెస్ట్ గా ఫంక్షన్ జరగనుంది రెండు ఏ లతో చెప్పకనే చెప్పారు. రెండు రోజుల్లో ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఆహా కి సంబంధించి ఒక బిగ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి తన స్టైల్ లో ప్రమోట్ చేశాడు బన్నీ.

ఇప్పుడు మరోసారి తన సొంత OTT సంస్థ కావడంతో బన్నీ రాక తప్పడం లేదు. కానీ జనాలు మాత్రం ఇలా రెండ్రోజుల కో ఈవెంట్ లో బన్నీ కనిపిస్తూ సభ్య సమాజానికి ఏం చెప్తున్నట్లు ? తన క్రేజ్ మళ్లీ మళ్లీ చూపించుకునే ప్రయత్నమా ? అని కామెంట్స్ పడుతున్నాయి. ఏదేమైనా స్టార్ హీరోలు అప్పుడప్పుడు కనిపించి తక్కువగా మాట్లాడితేనే వారికి క్రేజ్ ఉంటుంది.

ఇలా అస్తమాట్లు స్టేజిలెక్కి చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తూ ఎప్పుడూ ఇచ్చే స్పీచ్ తోనే వస్తే విసుగు రాక తప్పదు అంటున్నారు. ఏదేమైనా బన్నీ ఇలా ప్రతీ ఈవెంట్ కి గెస్ట్ అయితే రాను రాను తన స్టేచర్ తగ్గించుకున్నట్లే.