ఆహా... ఆహ్లాదకరమైన ఓటీటీ..!ఓ సినిమా ధియేటర్ కు వెళితే అయ్యే ఖర్చుతో ఏడాదంతా వినోదాన్ని అందిస్తున్న ”ఆహా” ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రస్తుతం మాంచి జోరుమీదుంటోంది. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదించే లేటెస్ట్ జనరేషన్ కోసం ప్రతి వారం ఓ సరికొత్త సినిమాను ప్రీమియర్ రూపంలో తీసుకువస్తూ అలరిస్తోంది.

అలాగే మహిళల కోసం బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖితో ‘చెఫ్ మంత్రా,’ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో ‘సర్కార్’ గేమ్ షోలతో పాటు, పిల్లల కోసం ప్రత్యేకంగా ‘ఆహా కిడ్స్’ విభాగంలో దేవుళ్ళ చరిత్ర తెలిపే కార్టూన్ సినిమాలను అందుబాటులో ఉంచింది.

ఇక ప్రజెంట్ ట్రెండ్ అయిన ‘వెబ్ సిరీస్’లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ‘కుడి ఎడమైతే’ వంటి థ్రిల్లర్స్ తో పాటు ‘బేకర్ అండ్ బ్యూటీ, తరగతి గది’ వంటి ఫీల్ గుడ్ స్టోరీలను, ‘3 రోజెస్’ వంటి ట్రేండింగ్ సబ్జెక్ట్స్ తీసుకువస్తూ అన్ని వర్గాల వారికి చేరువ అవుతోంది.

ఇక బాలకృష్ణతో మొదలుపెట్టిన ‘అన్ స్టాపబుల్’ తర్వాత ‘దబిడి దిబిడే’ అన్న రీతిలో నిజంగానే ‘ఆహా’ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. అన్ని రకాల కంటెంట్ కు నిలయంగా మారిన ‘ఆహా’లో త్వరలో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతోంది.

దేశవ్యాప్తంగా ‘ఇండియన్ ఐడల్’కున్న పేరు తెలియనిది కాదు, గాయనీగాయకుల పుట్టిన వేడుకగా ‘ఇండియన్ ఐడల్’ మోడల్ ఆదరణ పొందగా, తెలుగులో అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ వారాంతంలో ఆడిషన్స్ కూడా జరగనున్నాయి.

కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమైన ‘ఆహా 2.0’ ప్రాంతీయ భాషల్లో ఓ సంచలనంగా నిలిచింది. ఇప్పటివరకు ఒక్క తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా ఓ ప్రాంతీయ భాషలో, ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంది. ఆహా… వినడానికి ఎంత మధురంగా ఉంది, చూడడానికి కూడా అంతే ఆహ్లాదంగా ఉంటుంది.