agnyaathavaasiఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్ కాని సినిమాలు బుల్లితెరపై బంపర్ గా ప్రదర్శితమయ్యేవి. కానీ ఇపుడు ఈ ప్రభావం కనిపించడం లేదు. సిల్వర్ స్క్రీన్ పైన హిట్ అయితేనే స్మాల్ స్క్రీన్ పైన కూడా సందడి చేస్తున్నాయన్న విషయం… ‘రంగస్థలం, గీత గోవిందం, మహానటి, భరత్ అనే నేను’ సినిమాలకు దక్కిన టీఆర్పీ రేటింగ్స్ చెప్పకనే చెప్పాయి.

అలాగే బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైతే, అదే ఒరవడి స్మాల్ స్క్రీన్ పైన కూడా కనపడుతోందని ‘అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, సాక్ష్యం’ సినిమాలు నిరూపించాయి. ముఖ్యంగా యూత్ లో పవర్ ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమాకు దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ రావడం బుల్లితెర ప్రేక్షకుల తీరుకు అద్దం పడుతోంది.

అగ్ర హీరో సినిమాలు ఎంత దారుణంగా విఫలమైనా, ‘నా పేరు సూర్య’ మాదిరి కనీసం 10 టీఆర్పీ అయినా సొంతం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తాయి. కానీ అందులో 50 శాతానికి ‘అజ్ఞాతవాసి’ పడిపోవడం ఊహించని అంశం. ప్రస్తుతం రాజకీయాలలో విస్తృతంగా ప్రచారం చేస్తోన్న పవన్ ను, ఈ ‘అజ్ఞాతవాసి’లో కన్నా నేరుగా చూడడం బెటర్ అనుకున్నారో ఏమో!?