ae-dil-hai-mushkil-trailer-talkబాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సినిమాలలో “ఏ దిల్ హై ముష్కిల్” ఒకటి. ఇటీవల విడుదలైన టీజర్, వీడియో సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేయగా, తాజాగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా రెట్టింపు చేసే విధంగా ఉంది. రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ముక్కోణపు ప్రేమకధగా తెరకెక్కింది.

సిల్వర్ స్క్రీన్ పై ప్రేమకధలను అద్భుతంగా మలచడంలో నైపుణ్యత గల కరణ్ జోహార్ దర్శకత్వం, ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ కాగా, పాటలు, బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదనపు ఆకర్షణలు. ఐష్ – రణబీర్ ల రొమాన్స్ హైలైట్ గా నిలిచిన ఈ కధ ఫ్రెండ్ షిప్ – ప్రేమల నేపధ్యంలో సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.