advocate-rachana-reddy-resigned-from-tjsఎన్నికల వేళ తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా ప్రకటించారు. గత నాలుగేళ్ళ గా ప్రభుత్వంపై రచన వివిధ కేసులు వేసి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. రాజీనామా సమయంలో రచన కోదండరాం పై అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్‌ అయ్యిందని రాహుల్ చంద్రబాబు తో కోదండరాం అంతర్గత ఒప్పందం చేసుకున్నారని అన్నారు.

మహాకూటమిలో సామాజిక న్యాయం లేదని, మైనార్టీలకు టీజేఎస్‌ ఒక్క టికెట్‌కు ఇవ్వలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని, చంద్రబాబు డైరెక్షన్ కాంగ్రెస్ యాక్షన్ అన్నారు. టీజేఎస్‌ కు కూటమిలో భాగముగా పట్టుమని పది సీట్లు కూడా రాలేదు. ఇక అందులో మైనారిటీలు సీట్ల ఏంటో? ఈ కుదుపు తెలంగాణ జన సమితికి ఎన్నికల ముందు ఇబ్బందనే చెప్పుకోవాలి.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర పాలనను శాసిస్తారని తెరాస చేస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఆ పార్టీ కేవలం 13 స్థానాల్లో పోటీ చేస్తోందని గుర్తుచేశారు. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన కూటములతో పోలిస్తే ప్రజాకూటమిలో పార్టీల మధ్య ఐక్యత చాలా బాగుందని, కూటమి అధికారంలోకి వస్తే కుటుంబ పాలన పోయి ప్రజాపాలన ఏర్పడుతుందని తెలిపారు. రచనా రెడ్డి ఆరోపణల మీద మాత్రం ఆయన నేరుగా స్పందించలేదు.