Andhra Pradesh High Courtఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు అధికారపక్షానికి చెందిన నాయకులు మాత్రమే హైకోర్టుని నిందిస్తూ ధిక్కరిస్తున్నారు. తాజాగా హైకోర్టులోని ప్రభుత్వ లాయర్లు కూడా ఇదే పంథాలో వెళ్తున్నట్టుగా ఉన్నారు. వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలువురు వ్యక్తులు వేర్వేరుగా పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరుపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని సరికాదని ప్రభుత్వ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ చెప్పడం విశేషం. అలాంటి తీర్పునిచ్చే పరిధి హైకోర్టుకు లేదని, దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని ఆయన నివేదించారు.

ఏ అంశాల ఆధారంగా తీర్పునివ్వబోతున్నారో ముందే తమకు తెలియచేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టును కోరారు. తద్వారా ఆయా అంశాలపై తాము స్పష్టమైన వివరణలతో వాదనలు వినిపిస్తామన్నారు. కేవలం ప్రభుత్వం నియమించింది అనే కారణంగా కోర్టులకే పరిధి నిర్దేశించడం… ఎలా తీర్పులు ఇవ్వాలో వారే చెప్పడం గమనార్హం.

“దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవ్యవస్థ మీద చేస్తున్న దాడి పరిపూర్ణం అయ్యింది. ఇప్పటివరకూ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన దాడి చివరికి కోర్టులలో కూడా ప్రవేశించింది. ఇదే కంటిన్యూ అయితే మునుముందు ప్రజలు న్యాయవ్యవస్థను నమ్మే పరిస్థితి ఉందదు,” అని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.