Adivi-Sesh-Goodachari-Amazon-Primeఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలలో “గూఢచారి” ఒకటి. తక్కువ బడ్జెట్ లో అత్యున్నత నైపుణ్యతను రాబట్టిన ఈ సినిమాను చూసి టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని అమెజాన్ ప్రైమ్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది.

సెప్టెంబర్ 8వ తేదీన “గూఢచారి”ని విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు. దీంతో ఈ సినిమాను మరోసారి వీక్షించడానికి ప్రైమ్ సభ్యులు రెడీ అయిపోతున్నారు. ‘క్షణం’ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో సూపర్ హిట్ ను అందించిన ఘనతను అడవి శేష్ సొంతం చేసుకున్నాడు. ప్రైమ్ విడుదల కావడం… ఆ ప్రింట్లు పైరసీకి గురై ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడం అనేది కూడా సహజంగా మారిపోయింది.