‘పద్మావత్, సమ్మోహనం’ చిత్రాల ద్వారా తన అభినయంతో అలరించిన అదితీ రావ్ హైదరీ, చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…. చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. తన కుటుంబ సభ్యులు తనకెంతో స్వతంత్రాన్ని ఇచ్చేవాళ్లని చెప్పిన అదితీ, తన జీవితంలో ఒకే ఒక్క సంఘటన ఎదురైందని చెప్పింది.
చిన్న వయసులో తాను స్కూలుకు రైల్లో వెళ్లేదానినని, ఓ అంకుల్ తనను బ్యాడ్ గా టచ్ చేస్తూ వెళ్లాడని, అతని వైపు డర్టీగా చూస్తూ, ‘ఇంకెప్పుడూ ఎవరినీ ఇలా తాకవద్దు అంకుల్’ అని చెబుతూ హెచ్చరించి వెళ్లిపోయానని తెలిపింది. ఆపై తనకు ఎక్కడా ఎలాంటి సమస్యలూ ఎదురు కాలేదని చెప్పింది. ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాన్ని ఇంట్లోవాళ్లే తమ అమ్మాయిలకు చెప్పాలని హితవు పలికింది.
ఈ విషయంలో తనను తల్లిదండ్రులు చాలా ప్రొటెక్ట్ చేశారని చెప్పింది. లైంగిక వేధింపులపై మాట్లాడితే, అవకాశాలు తగ్గుతాయన్న వాతావరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉందని, పరిశ్రమలో హీరోయిన్లను వస్తువులా కాకుండా కళాకారులుగా చూస్తే ఈ పరిస్థితి మారుతుందని చెప్పిందీ ఈ హైదరాబాదీ బ్యూటీ. ప్రస్తుతం “చెక్క చివంత వానం” అనే తమిళ సినిమాలో కూడా నటిస్తోంది ఈ అందాల సుందరి.