Adhugo-Teaser-Ravi-Babuసృజనాత్మక దర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తోన్న “అదుగో” మొదటి టీజర్ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘బంటి’ పేరుతో పందిపిల్లను పరిచయం చేసిన పోస్టర్ తో ‘ఓకే’ మార్కులు వేయించుకున్న రవిబాబు, మొదటి టీజర్ తోనే ప్రేక్షకులను పడేయాల్సి ఉంది. ఎందుకంటే, ఈ ‘అదుగో’ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా. వాయిదాలు పడుతూ ఒక రకంగా ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.

అలాంటి సినిమా మళ్ళీ ప్రేక్షకుల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ టీజర్ హిలేరియస్ గా ఉండాల్సిందే. అలా ఉంటేనే అందరి చూపులు “అదుగో”పై పడతాయి, ఈ బంటికి తగినంత పాపులారిటీ దక్కుతుంది. శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఈ టీజర్ విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసింది.