addition of new scenes arjun Reddy Movieసందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. మొదట ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు వుండేదట. అయితే ఆడియన్స్ బోర్ ఫీలయ్యే ఛాన్స్ ఉందని భావించి, 15 నిమిషాల నిడివిని తగ్గించి వదిలారు.

ఈ సినిమా 3 గంటల పాటు ఉన్నప్పటికీ యూత్ ఎంత మాత్రం బోర్ ఫీలవ్వకుండా చూస్తున్నారట. దాంతో తాము ముందుగా అనుకున్న 15 నిమిషాల సీన్స్ ను కూడా కలిపితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. ఆ 15 నిమిషాల పుటేజ్ ను యాడ్ చేయడం వలన మరింత ఫీల్ వస్తుందని చెబుతున్నాడట.

అయితే ఈ 15 నిమిషాల పుటేజ్ ను వెంటనే యాడ్ చేద్దామా? లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేద్దామా? అనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ప్రతి సినిమా కూడా విడుదలైన తర్వాత కోతలకు గురవుతుంటే, ‘అర్జున్ రెడ్డి’ మాత్రం మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు.