adala prabhakar reddy - chandrababu naiduతెలుగుదేశం పార్టీ నెల్లూరు రురల్ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి ఈరోజు సాయంత్రం జగన్ సమక్షంలో వైకాపాలో చేరబోతున్నారు. 15 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ మంజూరు చేయించుకొని, అవి బ్యాంక్‌లో డిపాజిట్‌ అయిన మరు నిమిషమే ఆదాల టీడీపీ కండువా పక్కన పడేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆదాల ప్రభాకరరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్‌కు పోటీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతుంది.

పార్టీ మారుతానని బెదిరించి కొన్ని నెలల క్రితం రూ.600 కోట్ల పనులు చేజిక్కించుకున్నారని తెలుస్తుంది. అదే క్రమంలో వైకాపా నుండి పార్లమెంట్‌కు పోటీ చేయాలనే ముందస్తు ప్రణాళికలో భాగంగా పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని ధ్వంసం చేస్తూ వచ్చారట. పార్లమెంట్‌ ఇన్‌చార్జి హోదాలో పలు నియోజకవర్గాల్లో ఆదిపత్యం చెలాయించారని, వర్గాలను రెచ్చగొట్టి పార్టీని దెబ్బతీస్తున్నాడనే ప్రచారం విస్తృతంగా ఉంది.స్థానిక నేతలు ఆయన గురించి ఎంత చెప్పినా చంద్రబాబు నమ్మలేదు.

ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆదాల1999లో తెలుగుదేశంలో చేరి గెలిచి మంత్రి అయ్యారు. 2004 ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ముందు రోజు రాత్రి చంద్రబాబును కలిసి నేను, సోమిరెడ్డి కలిసి పని చేస్తాం, జిల్లా అంతా తిరిగి పార్టీని గెలిపిస్తామని చెప్పి తెల్లవారేసరికి జెండా మార్చేశారు. దాదాపుగా పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ అదే పని చేసారు. ఇప్పుడు ఈ మోసం కారణంగా టీడీపీపై నెల్లూరు పార్లమెంట్, దాని కింద ఉండే అసెంబ్లీ సీట్లలో ప్రభావం గట్టిగానే ఉండబోతుంది.