Adah-Sharma‘హార్ట్ ఎటాక్’ సినిమాతో కుర్రకారు గుండెలను దోచేసిన ఆదాశర్మ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోలేకపోయింది. రావాల్సిన బ్రేక్ ‘క్షణం’ రూపంలో వచ్చింది గానీ, అందులో ఆదా అభినయం ఆకట్టుకునేలా లేకపోవడంతో, సోషల్ మీడియాకే పరిమితమైంది. ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోన్న ఆదా, తాజాగా సిజ్లింగ్ ఫోటోను పోస్ట్ చేసి నెటిజన్లను తన వైపుకు తిప్పుకుంది.

తలకు ఓ టవల్ మరియు బాడీని కవర్ చేసే విధంగా నైట్ కాస్ట్యూమ్ ధరించి ఉన్న పోస్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో వీక్షకులను ఆకర్షిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది ఆదా కాస్ట్యూమ్స్ లో పొదుపు బాగా కనిపిస్తుండడంతో, మున్ముందు మరెన్ని సోయగాల చిత్రాలను పోస్ట్ చేస్తుందోనని చర్చించుకోవడం నెటిజన్ల వంతవుతోంది. మరి అంత కిక్ ఇస్తోన్న ‘అందాల బొమ్మ’ ఆదాశర్మ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి..!