Actress Richa Saxena caught in Sex Racketహైదరాబాద్ లో పేరొందిన స్టార్ హోటల్స్ లో వ్యభిచారం జరుగుతోందని పసిగట్టిన పోలీసులు, ఏకకాలంలో తాజ్ బంజారా, తాజ్ డక్కన్ హోటల్స్ పై దాడులు చేయగా, టాలీవుడ్ నటి రిచా సక్సేనా దొరికిపోయింది. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం… సినీతారలు తన వద్ద ఉన్నారని, వారిని ఏ హోటల్ కు కావాలంటే ఆ హోటల్ కు పంపిస్తానని చెబుతూ, మోనిక్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆన్ లైన్ లో ప్రకటనలు ఇస్తున్నాడు.

వీటిని గమనించిన పోలీసులు, సదరు ఐపీ అడ్రస్ పై, మోనిక్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ‘జూన్ 1:43’ నటి రిచా, తాజ్ బంజారాకు వస్తున్నట్టు తెలుసుకున్నారు. బంజారాలోని రూమ్ నంబర్ 412ను ఓ విటుడి కోసం మోనిక్ బుక్ చేశాడని, అక్కడికి రిచాను పంపాడని నిర్ధారిత సమాచారాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో ఓ బెంగాలీ నటిని తాజ్ డెక్కన్ లో ఓ సినీ ప్రముఖుడు బుక్ చేసుకున్నాడన్న సమాచారం కూడా అందింది.

దీంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పేరున్న ఈ రెండు హోటల్స్ పైనా ఏకకాలంలో దాడి చేశారు. పోలీసులు తమ వాహనాలు వదిలి, సూటు, బూటేసుకుని కస్టమర్ల మాదిరిగా హోటల్ లోనికి ప్రవేశించిన వీరు, వ్యభిచారానికి సహకరించిన తాజ్ బంజారా హోటల్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు. తాజ్ డెక్కన్ లో పట్టుబడిన హీరోయిన్ బెంగాలీ నటి శుభ్రా చటర్జీగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.