actress-namitha-petition-court-for-house-harassmentదక్షిణాది సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ ‘జెమినీ’ ఫేం, తమిళనాట అన్నా డీఎంకే అధికార ప్రతినిధి నమితకు, తను నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తనను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నాడని నమిత కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చి, హాట్ టాపిక్ అయ్యింది.

డిసెంబర్ 31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని వేధించాడని అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ లో నమిత ఆరోపించారు. తాను నెలకు 15 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నానని చెప్పడంతో, కేసును విచారించిన న్యాయమూర్తి జీ శాంతి, ఇరు పక్షాల వాదనలు విని, ఈ నెల 12 వరకూ అదే ఇంట్లో ఉండేందుకు నమితకు అనుమతి ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా మరో ఇల్లు చూసుకుని ఖాళీ చేయాలని ఆదేశించారు.