actress Chaurasia attacked at KBR park hyderabadఆదివారం నాడు రాత్రి 8.30 గంటల సమయంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వర్ధమాన నటి చౌరాసియా గుర్తు తెలియని దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దుండగుడిని వెతికే పనిలో నాలుగు పోలీస్ బృందాలు ఉండగా, అసలు ఆ రోజు తనకేం జరిగిందన్న సమాచారాన్ని చౌరాసియా వివరించింది.

గత మూడేళ్ళుగా తాను కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కు వెళ్తున్నానని, అలాగే ఆదివారం కూడా వెళ్లానని, వాకింగ్ పూర్తయ్యి తిరిగి కారు వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుండి ఓ వ్యక్తి దాడి చేసి, తన రెండు చేతులు వెనక్కి మలిచి డబ్బులు డిమాండ్ చేసాడని, అయితే తన వద్ద డబ్బులు లేవని, కావాలంటే ఫోన్ పే చేస్తానని అన్నట్లుగా చెప్పారు.

ఫోన్ నెంబర్ చెప్పడానికి అతను సంశయించడంతో తాను 100కు డయల్ చేయబోయానని, దీంతో అతను ఫోన్ లాక్కుని తనను బండరాయి పైకి తోసి బలంగా కొట్టడంతో తాను స్పృహ కోల్పోయానని, ఈ సమయంలో తనపై లైంగిక దాడికి యత్నించగా, తనకు స్పృహ రావడంతో ప్రతిఘటించి అక్కడ నుండి పార్క్ ఫెన్సింగ్ ఎక్కి దూకి తప్పించుకున్నానని తెలిపింది.