actress-bhavana-wedding-postponedమరో నాలుగు రోజుల్లో ఒక్కటవ్వాల్సిన హీరోయిన్ భావన – నిర్మాత నవీన్ ల పెళ్లి ఆగిపోయింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల అనంతరం చాలా నిరాడంబరంగా కుటుంబ సభ్యుల నడుమ నిశ్చితార్ధ వేడుకను జరుపుకుని, అక్టోబర్ 26వ తేదీన పరిణయ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్న భావన, ఇప్పుడు పెళ్లిని అర్ధంతరంగా వాయిదా వేసుకోవడం మాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

పెళ్లి వాయిదాను స్వయంగా ధృవీకరించిన భావన, ఇందుకు గల కారణాలను మాత్రం ప్రస్తావించలేదు. తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే వాయిదా వేసుకుందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో గానీ, మాలీవుడ్ వర్గాల్లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసు దీనికి ఓ ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై విడుదల కాగా, నిర్మాత నవీన్ ద్వారా ఈ కేసు నుండి భావనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణం వలనే వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతున్నా, ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో గానీ, భావన పెళ్లి వాయిదా పడిందన్నది మాత్రం వాస్తవం.