Actress-Anjali-Reaction-on-Fansతిరుమల సందర్శించిన తెలుగు హీరోయిన్ అంజలిని చూసి అభిమానులు వెంటపడ్డారు. అంజలితో ఒక్క ఫోటో దిగాలని ఊవ్విళ్ళూరారు. ఏ హీరోయిన్ కనిపించినా అభిమానులు చుట్టుముట్టడం సహజం. అయితే ఏ హీరోయిన్ కూడా దగ్గరికి పిలిచి అభిమానులకు ముచ్చటగా సెల్ఫీలు మాత్రం ఇవ్వరు, కానీ అంజలి అదే చేసింది.

తన వెంట వస్తోన్న అభిమానుల కోసం ఆగి, అందరితో కలిసి ఓ సెల్ఫీకి ఫోజిచ్చింది. ఇంకేముంది… వచ్చింది దైవదర్శనం కోసమే అయినా, చాలా అరుదుగా కనిపించే సెలబ్రిటీలు కళ్ళముందుకు వచ్చేసరికి వెంటపడిన ఫ్యాన్స్ కు సెల్ఫీని గిఫ్ట్ గా ఇచ్చి పంపింది ఈ సీతమ్మ. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ కు అవాక్కైన అభిమానగణం అంజలి ఇచ్చిన సెల్ఫీతో ఫుల్ ఖుషీ అయ్యారు.