కొన్ని సంవత్సరాల క్రితం హీరోగా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన వినోద్ కుమార్ తాజాగా హత్య యత్నం కేసులో అరెస్టు అయ్యాడు. సినిమాల్లో హీరోగా కనిపించిన ఈయన నిజ జీవితంలో విలన్‌గా తన వద్ద పని చేసే సచ్చిదానందం అనే వ్యక్తిని చంపేందుకు ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. వినోద్ కుమార్ తన స్నేహితుడు ఉదయ్‌తో కలిసి ఈ అగాయిత్యానికి ఒడి గట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
కేసు వివరాల్లోకి వెళ్తే… కొంత కాలంగా వినోద్ కుమార్ వద్ద ఆర్థిక పరమైన విషయాలను సచ్చిదానంద చూస్తూ ఉన్నాడు. ఆయనతో వినోద్ కుమార్‌కు ఏ విషయంలో విభేదాలు వచ్చాయో కాని, ఆయన్ను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని తన స్నేహితుడితో కలిసి వినోద్ కుమార్ ప్లాన్ వేశాడు. అయితే అది కాస్త వికటించింది. హత్య యత్నం కేసును బుక్ చేసి వినోద్ కుమార్‌ను అరెస్టు చేయడం జరిగింది. కేసుకు సంబందించిన విచారణ జరుగుతున్నట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే ఛాన్స్ ఉంది.