actor-sivaji-andhra-pradesh-special-status2014 ఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం చేసి కుక్కలా ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగా..! అదే నేను నేడు బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే… మీరు చేసిన ద్రోహమేనంటూ బిజెపిపై శివాజీ మండిపడ్డారు. నాపై ఎగబడిది వెనక్కిపోయే మనిషిని కాను, నా మీద జరిగే దాడి తెలుగువారి మీద జరుగుతున్నా దాడిగా గుర్తుంచుకోండి… అంటూ దాడి జరుగుతున్న సమయంలో బిజెపి నేతలను హెచ్చరించాడు శివాజీ.

నేను బిజెపిలో ఉన్న సమయంలో మీరెవరూ లేరు. ఇవాళ మీ స్వార్ధ ప్రయోజనం కోసం ఇలా గొడవలు చేస్తున్నారు. మీరు ఏమైనా చేయండి, నా చావు కోసమైనా తెలుగు వాళ్ళంతా ఒక్కటై తిరగబడతారు. తాను మరణిస్తే, తన లాంటి వారు వందల మంది పుడతారు, వారి ఆగ్రహానికి బిజెపి నాశనం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. గతంలో బిజెపి ఇలాంటి దాడులు చేసేది కాదని, ఇప్పుడు సంస్కృతిని తీసుకువచ్చారని విమర్శించారు.

ఈ దాడి వలన అర్ధమైన విషయం ఏమిటంటే… ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పలేని స్థితిలో బిజెపి నేతలు ఉన్నారు. అందుకోసమే ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే వారి నోళ్ళు మూయాలని చూస్తున్నారు. పూర్తి అధికారం ఉంది కదాయని ఇష్టమొచ్చిన విధంగా ప్రవర్తిస్తే… ఆ అధికారం మరో పన్నెండు మాసాలు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి… ఆ తర్వాత రాజెవరో… రెడ్డెవరో… నిర్ణయించేది ప్రజలే..!