Actor Sai Kumar Better leave Politicsబిజెపి తరపున కర్ణాటకలో పోటీ చేసి వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన తెలుగు హీరో కం నటుడు సాయికుమార్, ఇక ప్రశాంతంగా రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకునే సౌలభ్యాన్ని ప్రజలు కల్పించారు. ఇంతటి ఫేం ఉన్న నటుడు కనీసం ఒకసారి కాకపోతే మరొకసారైనా గెలుస్తారు, కానీ సాయికుమార్ విషయంలో ‘హ్యాట్రిక్’ పరాజయాలు నమోదు కావడం చెప్పుకోదగ్గ విషయం.

కర్ణాటకలో కమలం హవా బాగానే వీచినప్పటికీ, సాయికుమార్ ను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అంటే… నిజానికి ఇలా ఎన్నికల ముందు మాత్రమే సాయికుమార్ బరిలోకి దిగుతారు. సార్వత్రిక ఎన్నికల ముందు టికెట్ లభించిన తర్వాత మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడంతో, జనాలకు అందుబాటులో లేని వ్యక్తిగా పేరుగాంచారు. దీంతో ఇలాంటి నేత తమకు అవసరం లేదని, ఖాళీ సమయాలుంటే సినిమాలు పుష్కలంగా చేసుకోవచ్చని తీర్పునిచ్చారు.

అందులోనూ తెలుగు ప్రజలు బాగా ఉన్న చోట సాయికుమార్ పోటీకి నిలవడం… అప్పటికే బిజెపిపై కడుపు మంటతో తెలుగు ప్రజానీకం రగిలిపోతుండడం… బిజెపిని ఓడించాలంటూ చంద్రబాబు అండ్ కో పిలుపునివ్వడం…. సాయికుమార్ ప్రసంగాలు ఏమో మోడీ తదితరులను ప్రశంసిస్తూ సాగడం… అనేవి సాయికుమార్ కు ప్రతికూల అంశాలుగా మారయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంటే మరో అయిదేళ్ళ వరకు రాజకీయాల ప్రస్తావన అవసరం లేదన్న మాట.