హీరో రాజశేఖర్ ఒక రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.కారులోని ఎయిర్‌బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. అటుగా వచ్చిన వేరో కారులోని వారు ఆయనను గుర్తు పట్టి కార్ అద్దం పగులకొట్టి ఆయనను బయటకు తీశారు.
వారి కారులో ఆయనను తీసుకుని వెళ్ళగా మధ్యలో వేరే కారు ఇంటి నుండి తెప్పించుకుని ఇంటికి వెళ్లిపోయారట. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజశేఖర్ కు ఇదే మొదటి ఆక్సిడెంట్ కాదు. రెండేళ్ల క్రితం పీవీఎన్ఆర్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్ బయటపడ్డారు.
తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. గరుడవేగా సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆయన, ఆ తరువాతి సినిమా కల్కితో మరో ప్లాప్ మూటగట్టుకున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి అనే డైరెక్టర్ తో మరో సినిమా ప్రకటించినా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అటకెక్కించారని సమాచారం.
Dallas Kamma Folks Behind Acharya Sales?
Managing Two Heroines, This Manager Becomes A Sucker!