actor Prince and Archana reveals their Love in Telugu Bigg Boss Show‘బిగ్ బాస్’ షోలో సందడి చేస్తోన్న హీరో ప్రిన్స్ గత వారం రోజులుగా హౌస్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి వీక్షకులకు విదితమే. ముమైత్ హిందీలో మాట్లాడడంతో కెప్టెన్ గా 50 సార్లు స్విమ్మింగ్ పూల్ లో మునిగి బయటకు వచ్చి క్షమాపణలు కోరాలని శిక్ష విధించగా దానిని అమలు చేసి చూపించాడు. అలాగే తొలి వారంలో షో నుంచి నిష్క్రమించిన జ్యోతి ప్రత్యేక అధికారంతో విధించిన శిక్ష (షోలోని వారందరి బట్టలు ఉతకడం) ని కూడా చాలా నిబద్ధతగా చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఈ సందర్భంగా షోలో తన స్నేహితుడు ఆదర్శ్, అర్చనలతో పిచ్చాపాటి మాట్లాడుతూ… తాను ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నానని చెప్పాడు. అయితే మధ్యమధ్యలో అభిప్రాయభేదాలతో తామిద్దరం దూరమయ్యే వాళ్లమని, మళ్లీ కలిసే వాళ్లమని, అయితే తనకు ఇంత వరకు ‘ఈ అమ్మాయితో ఉంటే చాలు, జీవితంలో ఇంకేదీ అవసరం లేదనిపించలేదని’ చెప్పాడు. అమ్మాయిలు ప్రేమిస్తే అదే లోకంగా ఉంటారని, ఒక్కసారి బ్రేకప్ అంటే మాత్రం కనీసం అటు వైపు కూడా కన్నెత్తి చూడరని తన ప్రేమ సంగతులను వివరించాడు.

ఇక ప్రిన్స్ మాటలు విన్న హీరోయిన్ అర్చన తన ప్రేమ సంగతి కూడా బయట పెట్టింది. తాను అయిదేళ్ళు రిలేషన్ లో ఉన్నానని, మధ్యమధ్యలో బ్రేకప్ కూడా అయ్యేదని, కానీ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నానని, ఆ సమయంలో చాలా ఏడ్చేదానని, ఒక జీవితానికి కావాల్సిన అనుభవాలన్నీ ఆ ప్రేమలో అనుభవించేశానని చెప్పింది. ఇప్పుడు తాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనని, వాటి ఫలితాన్ని తన మనసు వరకు రానివ్వలేనని, తానెంత అటాచ్డ్ గా ఉంటానో అంతే డిటాచ్డ్ గా కూడా ఉండగలనని చెప్పుకొచ్చింది.