Baladitya, Baladitya Marriage, Actor Baladitya Marriage,  Telugu Actor Baladitya Marriage, Actor Baladitya Marriage Venue, Actor Baladitya Marriage Date, Actor Baladitya Wedding, Actor Baladitya Wedding Reception, Actor Baladitya Wedding Venue, Celebs Actor Baladitya Wedding‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ చిత్రంతో బాలనటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలాదిత్య, ఆ తర్వాత బాలనటుడుగానే ‘అబ్బాయి గారు’ వంటి పలు చిత్రాల్లో రాణించి, విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. అయితే ‘చంటిగాడు’ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన బాలాదిత్య ఆశించిన మేర సక్సెస్ అందుకోలేకపోయాడు. డబ్బింగ్ కళాకారుడు, వ్యాఖ్యాత, గేయ రచయిత అయిన బాలాదిత్య మనువు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.

జూబ్లీహిల్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. బాలాదిత్య దంపతులతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసుకుంటూ, మరో నటుడు శివ బాలాజీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు సమాచారం అందజేశాడు. సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ యువనటుడు జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశిద్దాం.