acident due to 3d paintingప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయులు ప్రత్యక్షమవుతారు. అంతలా అన్ని వర్గాల్లో తమ ప్రతిభను చతుకుని తమ స్థానాలను పదిలపరుచుకున్నారు ఇండియన్స్. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగల ప్రతిభావంతులుగా పేరున్న మన వారు… ఉన్నది లేనిది… లేనిది ఉన్నట్లుగా కూడా సృష్టించగలగడంలో నైపుణ్యత గడించిన వారు. అలాంటి ఓ ఉదంతమే చెన్నైలో చోటు చేసుకుంది.

ఈ ఫోటోలో కనపడుతున్న సొరంగ మార్గం కూడా అలాంటిదే. ఒక ఫ్లై ఓవర్ క్రింద సొరంగ మార్గం ఉన్నట్లుగా ఓ కళాకారుడు తన కళను ప్రదర్శించాడు. ఎంతగా అంటే… ఈ దోవలో వెళ్తున్న వారు నిజంగా ఇది సారంగా మార్గమే అనుకుని ఆ గోడను డీ కొట్టేంతవరకు! ఆ క్రమంలో తాజాగా ఓ కారు సదరు గోడను డీ కొట్టి అవాక్కవ్వాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు ‘ఎవరో ఇడియట్ ఇలా పెయింటింగ్ వేసాడంటూ…’ ఆ పెయింటింగ్ ఫోటోను మరియు ఆ గోడను డీ కొట్టిన తన కారు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసాడు.

ఆలోచించడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ… అంతలా తన కళను ప్రదర్శించిన కళాకారుడి ప్రతిభను మెచ్చుకోలేక ఉండలేం. అయితే ఇదే సమయంలో తనకు జరిగిన అనుభూతి మరొకరికి జరగకుండా జాగ్రత్త పడండి అంటూ మేలుకోలిపే ప్రయత్నం చేసిన కారు యజమానిని ప్రశంసించకుండా ఉండలేం.