Acharya - Narappa -BB3ఏడాది పాటు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ఊపు మీదకు వచ్చింది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీ లో లేని సందడి ఇక్కడ కనిపిస్తుంది. సంక్రాంతి సినిమాలకు ఆదరణ అదిరిపోగా… ఫిబ్రవరి లో చిన్న సినిమాల హవా ఉండనుంది. మార్చి నుండి మొదలుకొని అనేక పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, చెప్పుకోదగ్గ చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి.

పెద్ద సినిమాలన్నీ సమ్మర్ ని బుక్ చేసుకుంటున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల వంటి సీనియర్ హీరోలు … చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ సమ్మర్ కి సందడి చెయ్యనున్నారు. చిరంజీవి ఆచార్య మే 14న రాబోతుంది…. వెంకటేష్ ఒక రోజు ముందుగా నారప్ప తో 13న వస్తున్నా అని ప్రకటించారు.

అయితే ఈ రెండు సినిమాలలో ఒకటి వేరే తేదీకి వెళ్ళడం జరగవచ్చు. ఇక నాగార్జున వైల్డ్ డాగ్ మొన్న ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది. థియేటర్ రిలీజ్ ఉండదు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఇరువైపుల నుండీ అటువంటి ప్రకటన ఏమీ రాలేదు. నాగార్జున గనుక మనసు మార్చుకుని మేలో వస్తే… ఒకే నెలలో నలుగురు సీనియర్లను చూసే అవకాశం కలుగుతుంది.

ప్రస్తుతానికి మే 7, మే 21 ఖాళీగానే ఉన్నాయి. నాగార్జున రాకపోయినా అఖిల్ అయినా వచ్చినా అదో రేర్ కాంబినేషన్ అన్నట్టు.ఆచార్య, #బీబీ3 మాస్ మసాలా ఎంటర్టైనర్లు… నారప్ప తమిళ సినిమా రీమేక్ అంతర్లీనంగా మంచి మెస్సేజ్ ఉంటుంది… వైల్డ్ డాగ్ యాక్షన్ థ్రిల్లర్ వంటి సినిమా… నాలుగు వస్తే ఒకే నెలలో డిఫరెంట్ సినిమాలు చూసే అవకాశం కూడా కలుగుతుంది.