ఆచార్యతో ఆడియన్స్ దోపిడీ... నెటిజెన్ల ఆగ్రహంమెగాస్టార్ చిరంజీవి యొక్క ఆచార్య ప్రపంచవ్యాప్త తెలుగు థియేట్రికల్ వ్యాపారం 145 కోట్లు దాకా చేసింది. పాన్-ఇండియా ప్రాజెక్టులను పక్కన పెడితే చేస్తే ఇది చాలా పెద్ద రికార్డు. పెద్ద స్థాయిలో డబ్బులు రాబట్టాల్సి ఉండటంతో భారీగా టికెట్ ధరల పెంపు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం 4 రోజుల ఓపెనింగ్ వారాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ₹ 300 ధరతో విడుదల కానుందట. రికార్డ్ ధరలు పెట్టిన తరువాత పంపిణీదారులు భారీ పెంపు తప్పదని అంటున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంతో పెంపు కోసం వారు దరఖాస్తు చేసుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో చిరంజీవి స్నేహపూర్వక సంబంధాలు నెరపడంతో అనుమతి పొందడం సులభం అని వారు నమ్ముతున్నారు.

ఆచార్య కోసం మంజూరు చేసిన తర్వాత, ఇతర పెద్ద సినిమాలు కూడా దీనిని అనుసరించవచ్చు. దానితో సినిమాలు చూడటం అనేది ఆంధ్రప్రదేశ్ లో కాస్టలీ గా మారుతుందని సోషల్ మీడియాలో వాపోతున్నారు. చిరంజీవే ఈ దోపిడికి దారి చూపడం దారుణమని వారు అభిప్రాయపడుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య, రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, చరణ్ తో పాటు పూజా హెగ్డే కనిపించనున్నారు. చాలా సంవత్సరాల తరువాత మణిశర్మ చిరంజీవి సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.