Achari America Yatraజి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో .. మంచు విష్ణు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా ఈ రోజు విడుదలయ్యింది. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు, థమన్ సంగీతం అందించాడు. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా .. మొదటి ఆట అయ్యిన వెంటనే .. అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నది. చూసిన ప్రేక్షకులు ‘ఇదేం సినిమా రా ‘ అనుకుంటూ.. తలలు బాదుకుంటున్నారు. కొంతమంది అయితే ఇది జండూ బామ్ సినిమా అని డిక్లేర్ చేసేసారు.

ఈ సినిమా చుసిన ఒక ప్రేక్షకుడు ‘ బ్రహ్మానందం వేస్ట్ ‘ అని డిక్లేర్ చెయ్యగా, ఇంకొక ప్రేక్షకుడు ‘ విష్ణు సినిమాలు మానేస్తే బెటర్ ‘ అని చెప్పేసాడు. ఇంతకుముందు రిలీజ్ అయినా విష్ణు సినిమా ‘గాయత్రి’ లో కూడా విష్ణు చాలా చెత్త నటన ప్రదర్శించాడు. ముఖ్యంగా అతను సంభాషణలు పలికే తీరు అస్సలు బాగాలేదు. శ్రీను వైట్ల ‘ ఢీ ‘ ఒక్కటే విష్ణుకు సరైన సినిమా. అందులో అతని నటన.. పాత్రకు తగినట్లు సరిపోయింది. మోహన్ బాబు తన పిల్లలు గురించి మహానటులు అని చెప్పుకున్నా.. ప్రేక్షకులు మాత్రం వాళ్లలో ఉన్న విషయం ఇట్టె గ్రహించారు!

మోహన్ బాబు తనయుల నుండి గొప్ప సినిమాలు జనాలు కోరుకోవటంలేదు ! కానీ మరీ ఇంత దారుణమైన అట్టర్ ప్లాప్ సినిమాలు ఉహించనూ లేదు. ఇప్పటికైనా మోహన్ బాబు గ్రహించి .. దారితప్పుతున్న తనయుల్ని, మంచి సినిమాలు తీసేలా పర్యవేక్షించాలి. మోహన్ బాబు లక్ష్మి ప్రసన్నా పిక్చర్స్ పతాకం పై ఎలాంటి గొప్ప హిట్స్ అందించారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.