Acham Naidu Vs YS Jagan ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు జరుగుతున్న కసరత్తుపై అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తక్కువ ధరకే విద్యుత్ లభ్యమవుతున్నా… ఎక్కువ రేటుకు ఎందుకు కొంటున్నారని, విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తున్న ఏపీఈఆర్సీని ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజీ తప్పుబడుతోందని, రాష్ట్ర సంస్థ చేస్తున్న సిఫారసులను కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్పుబడుతున్నా ఎలా అనుమతిస్తారని, విద్యుత్ చార్జీలను ప్రభుత్వం దారుణంగా పెంచేందుకే సన్నాహాలు చేస్తోందని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు.

దీనిపై స్పందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలక్ ఇచ్చే వ్యాఖ్యలు చేసారు. “తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, కేవలం మూడు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని, రెండేళ్లలోనే రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ కొరతను లేకుండా చేసామని” ప్రసగించారు.

తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే… అధిక ధరలు ఎందుకు చెల్లిస్తామని, జగన్ కు పవర్ ప్రాజెక్టులున్న విషయాన్ని ప్రస్తావించిన అచ్చెన్న, విద్యుదుత్పత్తి కంపెనీల ఇబ్బందులు తమకంటే జగన్ కే బాగా తెలుసునని, జగన్ తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామంటే తాము తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నామని చురకలంటిస్తూ… అచ్చెన్న ఇచ్చిన కౌంటర్ జగన్ చేత నవ్వులు పూయించింది.