ABN-Radhakrishna-to-Nampally-Court-Tomorrowఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి రాధాకృష్ణ రేపు హైకోర్ట్ ముందు హాజరు కాబోతున్నారు. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారు హాజరవ్వక తప్పని పరిస్థితి.

ఈ కేసు ద్వారా టీడీపీకి మద్దతుగా ఉన్న ఆంధ్రజ్యోతిని నియంత్రించాలని, ఆ పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూసుకోవాలని వైకాపా ఉద్దేశం. అయితే ఇలాంటి సందర్భాలలో మాత్రం ఆ పార్టీ నాయకులు సులువుగా వాడేసే వ్యక్తిగత స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ ఏమయ్యాయో! వారికే తెలియాలి.