Tirumala Tirupati - YS Jaganప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా టాలీవుడ్ చుట్టూనే తిరుగుతుండడంతో ఎలక్ట్రానిక్ మీడియా వర్గాలు కూడా ఈ అంశం పైనే చర్చలను చేపడుతోంది. అందులో భాగంగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ‘టార్గెట్ టాలీవుడ్’ అంటూ ఓ చర్చను చేపట్టగా, ఈ కార్యక్రమంలో షో నిర్వాహకుడు వెంకట కృష్ణ వేసిన పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ డిబేట్ లో పలువురు వైసీపీ అభిమానులు అడిగిన ప్రశ్నలు తన దగ్గర ఉన్నాయని చెప్పి వాటిని చదివి వినిపించిన వెంకట కృష్ణ, ఆ అభిప్రాయాలను తాను గౌరవం ఇస్తానని, అందుకే ఇక్కడ చదివి వినిపించానని, అయితే తనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రజారవాణాగా భావించే ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలను పండగ సమయాలలో ఎందుకు 50 శాతం పెంచి ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు? ప్రజారవాణా కాబట్టి ఎక్కువ మంది ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి, ఇంకా చార్జీలను తగ్గించాల్సిందిపోయి, ‘ఎవడబ్బ సొమ్ము మీరు పెంచి అమ్మడానికి’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు.

అలాగే తిరుపతికి దర్శనం కోటి రూపాయలు ఏంటి? ఓ పక్కన చిలుకూరు బాలాజీ దేవాలయంలో దర్శనం ఉచితం, హుండీ కూడా ఉండదు, తిరుపతిలో అత్యధికంగా 300 రూపాయలు టికెట్ ఉండగా, ఇపుడు దర్శనం టికెట్ ధర కోటి రూపాయలా? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అలాగే బ్రేక్ దర్శనం టికెట్ కావాలంటే శ్రీవాణి ట్రస్ట్ కు 10 వేలు కడితే ఇస్తారా? దీనికి కనీసం ఆడిటింగ్ కూడా ఉండదని అన్నారు.

ఒక నిర్మాత పెట్టుబడి పెట్టి లాభం గడిస్తాడు, అది వ్యాపార ధోరణి. అధికారులు చేతుల్లో ఉన్న ప్రభుత్వానికి చేతనైతే పన్నులు వసూలు చేసుకోవాలి. ఎన్నికల ముందేమో వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకుని లాలూచీ పడతారా? 10 రూపాయలు చీప్ లిక్కర్ ఎవడు తయారు చేస్తున్నాడు? ఎక్కడ తయారు చేస్తున్నాడు? దాని పేరు, ఊరు తెలియదు.

దీనిని 250-300 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాలు అయ్యుండి, అక్కడికి వెళితే ఏటీఎం కార్డు తీసుకోరు, ఓ గూగుల్ పేలు ఉండవు, తీసుకున్న డబ్బులకు జవాబుదారీతనం లేదంటూ వైసీపీ సర్కార్ తీరును ఎండకట్టే ప్రయత్నం చేసారు. ప్రశ్నిస్తే అన్ని అంశాల పైన కూడా ప్రశ్నించాలి అంటూ వైసీపీ వర్గాలకు సూచనలు చేసారు.

Please check the below videos