Abhinetri-Sequelప్రభుదేవా, సోనూసూద్, తమన్నాలు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “అభినేత్రి” ఎలాంటి ఫలితాన్ని అందిపుచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా మూడు భాషల్లోనూ ముక్తకంఠంతో ప్రేక్షకుల చేత తిరస్కరణకు గురికాబడింది. కనీసం తమన్నా లుక్స్ కూడా ప్రేక్షకులపై ప్రభావితం చూపలేకపోయాయి.

అది చాలదన్నట్లు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా “అభినేత్రి 2″కు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారని, ఇందులో కూడా ‘అభినేత్రి’ తారాగణమే కనిపించనున్నారని, అలాగే మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కనీసం రెండవ ప్రయత్నంలోనే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి.