AB-de-Villiers-IPLఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్యాన్స్ కు తీపికబురును అందించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు తిలోదకాలు ఇచ్చేసినప్పటికీ, మరికొన్ని సంవత్సరాల పాటు ఐపీఎల్ లో కొనసాగుతానని ఏబీడీ స్పష్టం చేయడంతో ఐపీఎల్ కే కళ వచ్చినట్లయ్యింది.

ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించింది. ఈ వార్త కోసం ఆర్సీబీ అభిమానులు గత రెండు నెలలుగా వేచిచూస్తున్నారు. ఐపీఎల్ తో పాటు బిగ్ బాష్ లీగ్ లో టైటాన్స్ తరపున కూడా కొనసాగనున్నానని ఈ సందర్భంగా ఏబీడీ తెలిపారు. అంటే పొట్టి ఫార్మట్ లో తనకు అనుకూలంగా ఉంటుందని ఈ 360 డిగ్రీస్ బ్యాట్స్ మెన్ చెప్పకనే చెప్పాడు.