Aaradugula Bullet Trailer Talk - Gopi Chandచిన్న సినిమాలు కూడా ఎంతో క్రియేటివిటీతో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో ఓ మూడు, నాలుగు దశాబ్దాల కాలం నాటి మూస సినిమాలను విడుదల చేస్తుంటే నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. బహుశా ఆ జాబితాలోనే హీరో గోపీచంద్ నటించిన “ఆరడుగుల బుల్లెట్” నిలుస్తుందన్న బలమైన నమ్మకాన్ని ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కలిగించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి పవర్ ఫుల్ హీరోయిజంతో కూడిన టైటిల్ వృధా అయిపోయిందే అన్న భావన కలగడం తధ్యం.

నిజానికి ఇటీవల విడుదల చేసిన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లోనే ఈ సినిమా భవిష్యత్తు కనిపించింది. తాజాగా ‘ట్రైలర్’ ధృవీకరించింది. అంతే తేడా..! మాస్ మహారాజా రవితేజ నటించిన “కృష్ణ, కిక్, బలుపు” వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాలను కలిపి కొట్టి, బయటకు తీస్తే ఎలా ఉంటుందో, ఈ ట్రైలర్ చూస్తే… ఆ మూడు సినిమాల సన్నివేశాలు కళ్ళ ముందు అలా కనిపిస్తుంటాయి. ట్రైలర్ లో మొదలైన ఫస్ట్ షాట్ తోనే ప్రేక్షకులు నీరసించిపోవడం ఖాయం. దీనికి తోడు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం గురించి చెప్పాలంటే… ఎందుకులేండి… నిజంగా మణిశర్మ అభిమానులు ఎవరైనా ఉంటే బాధపడతారు.

మణియే నిజంగా దీనికి సంగీతం అందించారంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే… మణిశర్మ అందించిన పాటలు ప్రజాధరణ తగ్గడం మానేసేయోమో గానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మణి అద్భుతంగా ఇస్తారన్న నమ్మకం సినీ ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకానికి తూట్లు పొడిచే విధంగా ఈ ట్రైలర్ లో నేపధ్య సంగీతం ఉంది. నిజానికి ఈ సినిమా విడుదల కావడమే ఒక వార్త. మరి అలాంటి సినిమా మంచి నైపుణ్యంతో ఉండాలని ఆశించడం అత్యాసే కదా? వచ్చే వారం మే 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఎన్నాళ్ళ పాటు ధియేటర్లలో ఆడుతుంది? అన్న ప్రశ్న తలెత్తితే, ఈ ధియేటిరికల్ ట్రైలర్ చూడండి… మీకే అర్ధమవుతుంది..!