aaradhya-bachchanఅభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాధ్య తన తండ్రి విషయంలో ఒకసారి పొరపాటు పడిందట. అచ్చం తన తండ్రి అభిషేక్ లాగే జాకెట్, క్యాప్ పెట్టుకుని ఉన్న బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ని చూసి, అయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని ‘డాడ్’ అని పిలిచిందట. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుందని ఐశ్వర్యారాయ్ స్వయంగా పేర్కొంది.

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ స్టోరీలో ఈ విషయాన్ని ఐశ్వర్య వెల్లడించింది. రణ్ బీర్ ని అంకుల్ లేదా ఆర్కే అని తన కూతురు పిలుస్తూ ఉంటుందని కూడా ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అయితే, మరో వైపు, ఐశ్వర్య – రణబీర్ ల మధ్య హల్చల్ చేస్తున్న హాట్ హాట్ సన్నివేశాలు కూడా ‘అలా’ పిలిచేలా చేసిందేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ సమయంలోనే అభిషేక్ గుండె రాయి చేసుకోవాలంటూ ఐష్ – రణబీర్ లు ఉన్న హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.