Aamir Khan about Shashi Kapoorగ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతు సోమ‌వారం తుది శ్వాస విడిచిన బాలీవుడ్ ఆల్ రౌండ‌ర్స్ లో ఒక‌రైన శ‌శిక‌పూర్ గురించి అమీర్ ఖాన్ ట్విట‌ర్ లో ఎమోష‌న‌ల్ అయ్యారు.

శ‌శి అంకూల్ కేవ‌లం న‌టుడు ..గొప్ప ఫిల్మ్ మేక‌రే కాదు.. అంత‌కు మంచి మంచి మ‌నిషి .శ‌శి అంకుల్ చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఆనందానిచ్చాయి.భార‌తీయ రంగ‌స్థ‌లానికి శ‌శి క‌పూర్ సేవ‌లు వెల క‌ట్ట‌లేనివి ..ఆయ‌న స్థాపించిన పృధ్వి థియేట‌ర్ త‌న లాంటి వారికి ఒక గొప్ప వేదిక అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం సినీ అభిమానులంద‌రీకి ఎంతో విచార‌క‌ర‌మైన దినం అని …శిశి క‌పూర్ కుటుంబ స‌భ్యులైన సంజ‌న‌, కునాల్ క‌పూర్, క‌ర‌ణ్ అలాగే ఫ్యామిలీలి ప్ర‌తి ఒక్క‌రికి శశిక‌పూర్ మృతి ప‌ట్ల సంతాపం తెలియ చేశారు. ఆయ‌న ఆత్మ విశ్రాంతి తీసుకోవాల‌ని కాంక్షిస్తున్న‌ట్లు అమీర్ ఖాన్ తెలిపారు.

శశి క‌పూర్ 1938 మార్చి 18న కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు. పృథ్వీరాజ్‌కపూర్‌ మూడో కుమారుడు శశికపూర్‌. రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌లకు సోదరుడు. బ్రిటన్‌కు చెందిన జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం, కరణ్‌ కపూర్‌, కునాల్‌ కపూర్‌, సంజనా కపూర్‌లు. చిత్ర పరిశ్రమకు శశికపూర్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్‌ అందుకున్నారు.