Aakasme-Nee-Haddhu-Raa-(Soorarai-Pottru)-Teaser-Talk-Arresting-And-Captivatingతమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న తాజా చిత్రం, ఆకాశం నీ హద్దురా ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా. టీజర్ మోహన్ బాబు వాయిస్ ఓవర్ తో మొదలు అవుతుంది. సినిమాలో విషయం వస్తే సహజంగా అండర్ డాగ్ కథలకు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు.

సూర్య తన క్యారెక్టర్ లో ఒదిగిపోయినట్టు అనిపించింది. కొన్ని షాట్స్ లో ఆయన కళ్ళలో ఇంటెన్సిటీ అదిరిపోయింది. సహజంగా ఇటువంటి సబ్జెక్టు అన్ని తరగతుల వారిని ఆకట్టుకుంటుంది. మిగతా ఆర్టిస్టులు కూడా అతికినట్టు సరిపోయారు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట కొంత డబ్బింగ్ ఫీలింగ్ కలిగించింది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. శిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్‌ తో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, పరేశ్‌ రావల్‌, ఊర్మశి, వివేక్‌ ప్రసన్న, కాళీ వెంకట్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వేసవికి ఈ సినిమా విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. చాలా సంవత్సరాలుగా సూర్యకు హిట్ అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉన్న ఆయన ఇప్పుడు దాదాపుగా దానిని పోగొట్టుకున్నాడు. ఈ చిత్రంతో ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలి