Chuttalabbai, Chuttalabbai Trailer, Chuttalabbai Trailer Talk, Chuttalabbai Movie Trailer, Chuttalabbai Teaser, Chuttalabbai Teaser Talkహీరోగా, ఒక నటుడిగా సాయికుమార్ రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ అయిదు పదుల వయసులోనూ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే సాయి కుమార్ వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆది మాత్రం తొలి రెండు సినిమాలతో పర్వాలేదనిపించినా, ఆ తర్వాత మాత్రం కమర్షియల్ హీరోగా స్థిరపడాలన్న తాపత్రయంతో ఒకే రకమైన మూస కధలను ఎంపిక చేసుకుంటూ… వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయాలను చవిచూస్తున్నాడు.

తాజాగా ఆ జాబితాలోకే వచ్చిన మరో చిత్రం “చుట్టాలబ్బాయ్” కూడా చేరబోతుందన్న సంకేతాలను టీజర్ ఇచ్చేసింది. ‘లౌక్యం, శౌఖ్యం’ వంటి కోన వెంకట్ సినిమాలు గుర్తున్నాయా… లేకపోతే ఈ “చుట్టాలబ్బాయ్” టీజర్, అలాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ‘కంటెంట్’ బేస్డ్ సినిమాల రూపకల్పన ఎక్కువగా జరుగుతోంది. ప్రేక్షకులు కూడా అవే కోరుకుంటున్నారు. మరి అలాంటి దశలో ఆది ఇలా రెగ్యులర్ సినిమాలను ఎంపిక చేసుకోవడం అనేది… ఆదికి నిర్దేశించే దశాదిశాలలో లోపాలు ఉన్నట్లు కనపడుతోంది.

ఇక, విడుదలైన టీజర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే టీజర్ చివరి సన్నివేశంలో ఒక రౌడీని కొట్టిన తర్వాత క్రింద పడి గాల్లోకి ఎగిరిన సన్నివేశం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ‘దమ్ము’ సీన్ ను జ్ఞప్తికి తెస్తోంది. జూనియర్ చేస్తేనే… మరీ ‘ఓవర్’ అంటూ ప్రేక్షకులు నిర్మొహమాటం లేకుండా తిప్పికొట్టారు. మరి ఆది చేస్తే, ఏమంటారో వారే నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా… కధల ఎంపికలో ఈ సాయి కుమార్ గారి బాబు ఎదగాలని ‘చుట్టాలబ్బాయ్’ టీజర్ స్పష్టం చేసింది.