aadai-first-look-amala-paul-very-intense-spine-chillingతన కొత్త సినిమా “ఆడై” ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరికీ షాక్ ఇస్తానంటూ చెప్పుకొచ్చిన మలయాళ బ్యూటీ అమలాపాల్, ఆ విధంగా నిజంగానే షాక్ ఇచ్చే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. రియలిస్టిక్ సినిమాలను అందించడంలో సిద్ధహస్తులైన తమిళ సినీ వర్గాలు, ఈ “ఆడై” ద్వారా మరోసారి అలాంటి రుచిచూపించబోతున్నారని స్పష్టం అవుతోంది.

వైట్ క్లాత్స్ మాత్రమే చుట్టుకుని ఏడుస్తూ ఉన్న అమలా పాల్, ఈ ప్రాజెక్ట్ ద్వారా సెన్సేషన్ సృష్టిస్తుందని కోలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. ‘మేయదామాన్’ ఫేం రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుగా తెరకెక్కింది. టైటిల్ లో ఉన్న ‘AAA’లకు ‘arrogant audacious artistic’ అన్న ట్యాగ్ లను పెట్టింది చిత్ర యూనిట్.