A1 Express- Bangaru Bullodu - 30rojulo preminchadam ela - Zombie Reddyదాదాపుగా తొమ్మిది నెలల పాటు స్తబ్దుగా ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఈ ఏడాది విడుదలైన మొదటి స్టార్ చిత్రం క్రాక్ పెద్ద హిట్ కావడం… ప్రేక్షకులు తండోపతండాలుగా రావడంతో ఇండస్ట్రీకి ఊపిరి ఊడినట్టు అయ్యింది. రెండు రోజులలోనే ఆ సినిమా పది కోట్లకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ కు తిరుగులేని ధైర్యాన్ని ఇచ్చింది.

దానితో టాలీవుడ్ లో సందడి షురూ అయ్యింది. చాలా నెలలుగా షూటింగ్ పూర్తి చేసి ఖాళీగా పెట్టుకున్న సినిమాల విడుదల తేదీలను ప్రకటించేస్తున్నారు. అది కూడా లేట్ అయితే బస్సు దొరకదు అనినంత స్పీడ్ తో. అల్లరి నరేష్ బంగారు బుల్లోడు ఈ నెల 23న విడుదల అవుతుండగా యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 29న విడుదల అవుతుంది.

జాంబీ రెడ్డి ఫిబ్రవరి ఐదున, ఏ1 ఎక్సప్రెస్ ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధం అని ప్రకటించేశాయి. పెద్ద సినిమాలు వేసవిని టార్గెట్ చేస్తుండగా.. చిన్న మీడియం రేంజ్ సినిమాలు ఫిబ్రవరి, మార్చి నెలలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇటువంటి కోలాహలం కనిపించడం లేదు.

చాలా వరకు సెంటర్లలో 50% రూల్ పాటించడం లేదు… మల్టీప్లెక్సలు, కొన్ని ప్రముఖ సెంటర్లు మాత్రమే ఫాలో అవుతున్నాయి. మరోపక్క కరోనా కేసులు కూడా ఎక్కువ నమోదు కావడం లేదు. దానితో నిర్మాతలు ధైర్యం చేసి సినిమాలు విడుదల చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగి మరిన్ని ఆ వేవ్ ఈ వేవ్ అంటూ ఇబ్బంది పెట్టకపోతే టాలీవుడ్ తొందరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది.