A-R-Murugadoss-Obsessed-with-Teluguప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో అత్యంత దారుణమైన డిజాస్టర్ ను ఇచ్చిన ఘనతను “స్పైడర్” రూపంలో మురుగదాస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిజం లేకుండా విలనిజంతో సినిమాను నడిపించిన తీరును తెలుగు ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అప్పటినుండి టాలీవుడ్ కు మురుగదాస్ దూరమయ్యారు. అలాగే మరో తెలుగు హీరో కూడా మురుగదాస్ పేరేత్తలేదు.

అంతలా ప్రభావితం చూపిన “స్పైడర్” సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలని మురుగదాస్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇది షాకింగ్ లాంటి నిర్ణయమే. బహుశా హిందీలోకి రీమేక్ చేసే సమయంలో ‘స్పైడర్’ సబ్జెక్ట్ లో మార్పుచేర్పులు జరుగుతాయేమో చూడాలి. హిందీలో ‘గజినీ’ ద్వారా మురుగదాస్ మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో హీరోగా ఎవరిని ఒప్పిస్తారో చూడాలి.