Brother comments on Madhu-Priya-Srikanth issueతన భర్త రాచి రంపాన పెడుతున్నాడంటూ మీడియా వేదికగా బండ బూతులన్నీ తిట్టిన సింగర్ మధుప్రియ, రెండు రోజులకే తన మనసు మార్చుకుని భర్తతో పాటు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు, మూడు రోజుల పాటు మీడియా వర్గాల పాలిట సంచలనమైన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మధుప్రియకు, ఆమె కధనాలను ప్రసారం చేసిన మీడియా వర్గాలకు ఓ సామాన్య యువకుడు ఒక రేంజ్ లో క్లాస్ పీకాడు.

‘నా కొడుకులు’ అంటూ పురుష జాతిని అవమానించిన మధుప్రియ వ్యాఖ్యలు మహిళా సంఘాలకు కనపడలేదా..? బాలకృష్ణ ఏదో తనతో పాటు నటించిన హీరోయిన్ పై కామెంట్ చేస్తే… విరుచుకుపడ్డ మహిళా సంఘాలకు ఇవి కనపడలేదా? మేము కూడా పురుష సంఘాలు నెలకొల్పుకోవాలా? అంటూ ప్రశ్నించాడు. అలాగే బడ్జెట్ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటే, వాటిని పక్కన పెట్టి మరీ, ఈ మధుప్రియ ప్రసారాలు చేయడం మీడియా చేసే బాధ్యతేనా? మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి… అలంటి మీడియా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించరాదు అంటూ హితవు పలికాడు.

ఇక, మధుప్రియ తనను తానూ సెలబ్రిటీగా ఎక్కువ ఫీలైపోతుంది… అసలు ఆడపిల్లను అనే అర్హత కూడా మధుప్రియకు లేదని, పెళ్లి సమయంలో తల్లితండ్రులపై మండిపడి, పెళ్ళైన తర్వాత భర్తతో గొడవపడి, మళ్ళీ భర్తతో వెళ్లి తండ్రిని జైలు పాలు చేసిన మధుప్రియకు అసలు మాట్లాడే అర్హతే లేదు… నీ తల్లితండ్రులను వదిలి బుద్ధిగా నీ భర్తతో కాపురం చేసుకో, నిన్ను ఏం చూసి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అంటూ కామెంట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.