a-aa-fame-hari-teja-interviewత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అ…ఆ…’ సినిమాలో హీరోయిన్ సమంత పక్కన ‘మంగమ్మ’గా నటించిన హరితేజ, ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. అంతకుముందే సీరియల్స్, యాంకరింగ్ చేస్తున్నప్పటికీ, ‘అ…ఆ…’ సినిమాతో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. ఇప్పుడిప్పుడే బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి తెలిపింది.

‘పెళ్ళయిన నాలుగు రోజుల తర్వాత తన భర్త దీపక్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల తానూ ఏడ్చేసానని, వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి నా ఆవేదన అంతా వెలిబుచ్చానని, మగవాళ్ళు అలాగే ఉంటారు, నిదానంగా వాళ్ళే మారతారని అప్పుడు మా అమ్మ సర్దిచెప్పింది గానీ, నిజానికి మారింది తన భర్త కాదు, తానే మారిపోయి దీపక్ రూట్ లోకి వెళ్ళిపోయానని, ఇప్పుడు తనకు కూడా బాగా అలవాటైపోయిందని’ చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఏ విషయం అంటారా… హరితేజ భర్త దీపక్ కు ఫిట్ నెస్ శ్రద్ధ చాలా ఎక్కువట. ఎంతసేపూ జిమ్ లోనే కాలం గడిపేవారట. కనీసం పెళ్ళయిన కొత్తలో అయినా సరదాగా తనను బయటకు తీసుకువెళ్తారని భావిస్తే, అప్పుడు కూడా జిమ్ లోనే గడపడం హరితేజకు కోపం రావడంతో బాధతో అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసే దానిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన భర్త రూట్ లోనే తానూ కూడా జిమ్ కు వెళ్లిపోతున్నానని చిలక పలుకులు పలికింది ఈ మంగమ్మ.