Brahmostavam_A Aa movieబాక్సాఫీస్ వద్ద త్రివిక్రమ్ సత్తా ఏమిటో మరోసారి రుజువవుతోంది. ‘మాటల మాంత్రికుడు’ వేసిన పంచ్ లకు ప్రేక్షకులు కోట్ల రూపాయల కలెక్షన్స్ ను బహుమతిగా అందజేస్తున్నారు. తొలి 3 రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు షేర్ వసూలు చేసి నితిన్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘అ…ఆ…’ ఇందులో యుఎస్ ప్రేక్షకుల వాటా భారీగా ఉండడం విశేషం.

మొదటి మూడు రోజులకు గానూ 1.39 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘అ…ఆ…’ ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను దాటేసింది. ఓవర్సీస్ లో ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే… ఇటీవల విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ 7వ స్థానంలో 1.05 మిలియన్ డాలర్లతో నిలువగా, లేటుగా వచ్చినా… లేటెస్ట్ గా వచ్చిన త్రివిక్రమ్ సినిమా ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఏకంగా 2 మిలియన్ మార్క్ ను అందుకోవడం చాలా తేలికగా కనపడుతోంది.

అంటే ‘శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల తర్వాత 2 మిలియన్ క్లబ్ లో చేరబోతోంది హీరో నితిన్ సినిమా. అయితే యుఎస్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ పుణ్యమే అన్నది బహిరంగ విషయమే. ఒక్క ఓవర్సీస్ లో కాదు… ‘అ… ఆ…’ కలెక్షన్స్ ‘అ’మెరికా టు ‘ఆం’ధ్రా మోత మోగిస్తూ… సినిమా టైటిల్ కు సరికొత్త అర్ధాన్ని చెప్తున్నాయి.