voters-in-polavaram-submerged-villagesపోలవరంప్రాజెక్టు మంపు మండలాల గ్రామాలను ఏపీలో కలపడంతో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. దీనివల్ల ఓటర్ల సంఖ్యలో భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో చివరిస్థానంలో నిలిచింది. నియోజకవర్గంలో ప్రస్తుతం 1,33,756 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో పురుషులు 64,993 కాగా, మహిళలు 68,745, ఇతరులు 18 మంది. 2014లో 2,16.772 మంది ఓటర్లు ఉన్నారు.

అంటే 2014 ఎన్నికల నాటితో పోలిస్తే ఈసారి దాదాపు 83 వేల ఓటర్లు తగ్గారన్నమాట. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 5. 49 లక్షల మంది ఓటర్లతో శేరిలింగంపల్లి టాప్‌లో నిలిచింది. అలాగే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉండగా 39 నియోజకవర్గాల్లో లక్ష నుంచి రెండు లక్షల వరకు ఓటర్లు ఉన్నారు.

జీహెచ్‌ఎంసీ, దాని పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య మూడు లక్షల నుంచి 5 లక్షలు దాటింది. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, కార్వాన్, చార్మినార్, యాకుత్‌పురా మినహా మిగతా నియోజకవర్గాల్లో 2లక్షల నుంచి 3లక్షల ఓటర్లు ఉన్నారు.