Ramatheertham Templeవైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ దేవాలయాలలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. దేవతా మూర్తులను కూడా ద్వాంసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి క్రైస్తవుడు కావడంతో సహజంగానే ఆయన పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అండ చూసుకుని అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి అని ఆరోపణ.

ఇప్పటిదాకా ఈ విషయం పై ఎక్కువగా హిందూ సంస్థలు… బీజేపీ మాత్రమే స్పందించాయి. అయితే బీజేపీ ఏపీలో ఉన్న పట్టు తక్కువే కాబట్టి పెద్దగా ప్రభావం లేదు. సహజంగా మత రాజకీయాలకు టీడీపీ దూరంగా ఉండటంతో నామమాత్రంగానే స్పందించింది. అయితే అటువంటి ఘటనలు పెచ్చు మీరిపోవడం.. రామతీర్ధం వంటి పురాతన ఆలయం మీద కూడా దాడి జరగడంతో చంద్రబాబు కదిలారు.

స్వయంగా రామతీర్ధం రావడంతో ఈ అంశం పై మీడియా దృష్టి… ప్రజల దృష్టీ పడ్డింది. టీడీపీ నే చేయిస్తుంది అంటూ అధికార పక్షం ఆరోపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ అటువంటివి చేసిన చరిత్ర టీడీపీకి లేకపోవడంతో ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో అధికార పార్టీ పాత్ర ఉందని చెప్పలేకపోయినా… సమర్ధమైన చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యిందని మాత్రం చెప్పవచ్చు.

కొన్ని నెలల క్రితం జరిగిన అంతర్వేది రథం ఘటన సిబిఐకి ఇస్తున్నాం అని హడావిడి చెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేదు. ఇప్పటివరకు జరిగిన ఘటనలలో ఎవరినీ అరెస్ట్ చెయ్యలేదు. సిబిఐ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నలలో పని చేసినా ఆ పార్టీ కూడా చేసింది ఏమీ లేదు.