ఈ వారం సినిమాల పై 35 కోట్లురేపు శుక్రవారం టాలీవుడ్ లో ప్రధానంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాయి. కార్తికేయ చావు కబురు చల్లగా, మంచు విష్ణు మోసగాళ్లు, ఆది సాయి కుమార్ శశి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ మూడు సినిమాల పై దాదాపుగా 35 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ మేరకు ఈ మూడు సినిమాలు రాబట్టాల్సి ఉంది.

ఆర్ఎక్స్ 100 తరువాత హిట్ అనేది లేని కార్తికేయ చావుకబురు చల్లగా సినిమా 12 కోట్ల బిజినెస్ చేసింది. జీఏ2 పిక్చర్స్ నుండి వస్తున్న సినిమా కాబట్టి మంచి బిజినెస్ జరిగింది. కార్తికేయ ఆర్ఎక్స్ 100 11.6 కోట్ల షేర్ రాబట్టింది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కార్తికేయ తన కేరీర్ బెస్ట్ సినిమా పెట్టాలి.

మోసగాళ్లు సినిమాను విష్ణు సొంత రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా మీద 50 కోట్లు పెట్టా అని చెప్పినా… దాదాపుగా 20 కోట్లు రాబడితేనే గానీ హిట్ అనిపించుకోదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక శశి సినిమా ఒకే ఒక లోకం అనే పాట సూపర్ హిట్ కావడంతో దానిమీదే ఆశలు పెట్టుకుంది. సినిమాను కూడా చాలా రీజనబుల్ గా 2.5 కోట్లకు అమ్మారు.

ఏ మాత్రం బావుంది అనిపించుకున్నా రికవరీ ఈజీ అనే చెప్పుకోవాలి. అలా ఈ మూడు సినిమాల పై దాదాపుగా 35 కోట్ల బిజినెస్ జరగాలి. అడ్వాన్సులు పరంగా మూడు సినిమాలు వీక్ గానే ఉన్నాయి. రేపు విడుదల తరువాత టాక్ మీదే భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడివుంది.