YS-Jagan-Mohan-Reddy AP Chief Ministerయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి పుష్కర కాలం గడిచింది. ఈ సందర్భంగా ఏపీ అంతటా వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. “దేవుడు దయ ప్రజల చల్లని దీవేనేలే” మా పార్టీ బలం అని.. మా మేనిఫెస్టో బైబిల్..,ఖురాన్.., భగవద్గీత… అని ప్రజలందరి ఆశీస్సులతో ముందుకెళ్తామని తన సోషల్ మీడియాలో ట్వీట్ వేసారు వైస్ జగన్ రెడ్డి.

ఈ సందర్భంగా రాష్ట్రమంతా వైసీపీ పార్టీ కార్యాలయాలలో సంబరాలు జరుపుకుంటున్నారు పార్టీ నేతలు.,కార్యకర్తలు. జగన్ పాలనలో రాష్ట్రం మూడు సంవత్సరాలలోనే ముప్పై ఏళ్ల అభివృద్ధిని సాధించిందని సకల శాఖ మంత్రిగా పేరుపొందిన సజ్జల పేర్కొన్నారు. ముప్పై ఏళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రజలకా..? లేక వైసీపీ నేతలాకా..? బదులివ్వాలని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యంగా ఛలోక్తులు విసురుతున్నారు సజ్జలపై.

రానున్న ముప్పై ఏళ్ళు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ముప్పై ఏళ్ల మాట సరే కాని రానున్న రెండేళ్ల సంగతి చూసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. అప్పులు చేసి సంక్షేమ కార్యాక్రమాలు చేస్తే తిరిగి అధికారంలోకి రాలేరని అలా చేయడం వలన రాష్ట్రము అంధకారంలోకి వెళ్తుందని.., వైసీపీ నాయకులు తమ ఆదాయాలు పెంచుకొనే పనిలో ప్రజల ఖర్చులను పెంచుకుంటూ పోతున్నారని చురకలు వేస్తున్నారు వైసీపీ వ్యతిరేక వర్గం.

వైసీపీ నాయకులు.., రాష్ట్ర మంత్రులు ఈ పుష్కర కాలంలో రాష్ట్ర ప్రజలకు ఒరగపెట్టింది ఏమి లేదని.., వైస్సార్ సీపీ ఎజెండా “సంక్షేమం ౼ అభివృద్ధి” కాదని “అక్రమాలు ౼ అబద్ధాలని” టీడీపీ నేతలు బాహాటంగానే సందు చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు.