3 songs ready for Mahesh Babu 25th Movieసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం, భరత్ అనే నేను షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. వచ్ఛే ఏడాది వేసవి కాలంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తరువాత మహేష్ తన కెరీర్లో 25వ చిత్రం, ‘మహేష్25’ స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే ఆ సినిమా కోసం మూడు పాటలు రెడీ అయ్యాయట.

ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ వంశి పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్ఛే ఏడాది గాని సెట్స్ మీదకు వెళ్ళదు. అంటే ఈ చిత్ర యూనిట్ చాల ఫాస్ట్ గా ఉన్నట్టే లెక్క.

దిల్ రాజు కాకుండా సీనియర్ నిర్మాత అశ్విని దత్ కూడా పార్టనర్. మహేష్ బాబు గత ఐదు చిత్రాలలో నాలుగు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎలాగైనా బ్లాక్ బూస్టర్లు చెయ్యాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!