Vasudeo S Gaitonde ముంబైలో ఓ ఆయిల్ పెయింటింగ్ వేలంలో అనూహ్యంగా రూ. 29.3 కోట్లకు అమ్ముడుపోయింది. ఆర్టిస్ట్ వాసుదేవ్‌ గైటుండే అనే కళాకారుడు వేసిన చిత్రాన్ని ఆక్షన్‌లో పెట్టారు. దీన్ని గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ఆర్ట్ వర్క్‌లో ఇంత భారీ మొత్తానికి కళాఖండం వెళ్లడం వాల్డ్ రికార్డ్‌లో ఇదే ఫస్ట్ టైమ్. టైటిల్ లేని ఈ పెయింటింగ్, గతంలోని ఓ కళాఖండానికి పలికిన ధరను బ్రేక్ చేసింది.

1995లో న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఓ పెయింటింగ్ సుమారు 26 కోట్లకు వెళ్లిన విషయం తెల్సిందే! ముంబైలోని తాజ్‌మహల్ పేలస్ హోటల్‌‌లో ఈ వేలాన్ని నిర్వహించారు. భారతీయ కళాఖండాల్లో మరే పెయింటింగ్ కూడా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదని, వేలాన్ని నిర్వహించిన క్రిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ విలియం రాబిన్‌సన్ తెలిపారు. వాసుదేవ్ 2001లో చనిపోయాడు. 1979లో ఆయన వేసిన పెయింటింగ్ ఒకటి 2013లో జరిగిన వేలంలో దాదాపు 23 కోట్లకు అమ్ముడుపోయింది. మంగళవారం జరిగిన ఈ వేలం ఇండియాలో క్రిస్టీ నిర్వహించిన వాటిలో మూడోది!